Saturday, January 14, 2012

Why this '' కోళ్ల ''.... '' వెర్రి ''

ఇక్కడ స్పెషల్ పలావు, చీకులు, చికెన్‌జాయింట్‌ల వేపుడు, తండూరి చికెన్‌తో చక్కని విందు భోజనం మీ కోసం సిద్ధంగా ఉంది. తప్పనసరిగా రండిసార్...అంటూ ఆహ్వానం పంపుతున్న వారెవరా అని ఆశ్చర్యపోకండి. ఏటా సం క్రాంతికి జరిగే కోళ్ల పందేలు సాధారణంగా ఉం టే ప్రత్యేకత ఏముందనుకున్న నిడదవోలు మండలం సింగవరానికి చెందిన వ్యక్తులు ఇలా నోరూరించే వంట కాలతో మరీ కోళ్ల పందేలకు ఏర్పాట్లు చేసి ఓ ఆహ్వాన పత్రాన్ని వేసి పందేల రాయుళ్లను పిలుస్తున్నారు. నిడదవోలు సమీపంలోని ఓ కొబ్బరి తోటలో భారీ ఎత్తున ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ విషయం ఆహ్వానపత్రంలో లేకపోయినా అటు ఇటు కోడి పుంజులతో ‘మకర సంక్రాంతి శుభాకాంక్షలు... 14, 15 తేదీల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు విందు’ అని ముద్రించారు. చక్కని మెనూతో పాటు కిక్ ఇచ్చే పందేలకు వెళ్లకుండా ఎలా ఉంటాం అని బడాబాబులు సిద్ధమవుతున్నారట.
-  కొవ్వూరు (పశ్చిమగోదావరి)

No comments:

Post a Comment