Tuesday, January 17, 2012

కోడి పందాల రక్తపు సొమ్ము


 
‘ప్రాణాలు తీయాలి..మూగజీవాలను దగ్గరుండి మరీ చంపించాలి.. అవసరమైతే కత్తులు కట్టాలి..డబ్బు మూట కట్టాలి’ ఇది కోడిపందెం దారుల సూక్తి. ప్రకాశం జిల్లా ఎడ్ల బండలాగుడు పోటీల్లో ఇద్దరి ప్రాణాలు పోయినా,చిత్తూరు జిల్లా రంగంపేట జల్లికట్టులో ఇరవై మంది గాయపడ్డా, ఎద్దుకు తీవ్రగాయాలు,గోదావరి జిల్లాల్లో కోళ్లను పణంగా పెట్టడం.. ఇవన్నీ సంక్రాంతి చేదు జ్ఞాపకాలే. పాపం..వాళ్లను ఎందుకు లెండి విమర్శించడం !. సంక్రాంతి పండుగకని.. సరదాగా మూడురోజుల పాటు రాష్ట్రంలో కోడిపందాలు నిర్వహించుకున్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాలు నభూతో నభవిష్యత్తు అన్న తీరుగా జరిగాయి. డబ్బులు,మద్యం ఏరులై పారాయి. డబ్బు విషయం కదా !






Hen
ప్రజాప్రతినిధులందరూ కూడా ఒకతాటిపై కొచ్చారు. అంత తక్కువ వ్యవధిలో ఎక్కువ డబ్బులు ఏమి చేస్తే సంపాదించొచ్చు చెప్పండి? ముపె్ఫై వేల పుంజులు చస్తే చచ్చాయి..కష్టపడి కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. సామాన్యుడి ఆడితే అది జూదం. కానీ ధనికులు, ప్రజాప్రతినిధులు, కొద్దోగొప్పో పేరున్నవాళ్లు ఆడితే యోగం అని సరిపెట్టుకోవాలి. కోళ్లను పావులుగా చేసి సంపాదించిన వీరందరూ కోడీశ్వరులే. ఓ కంట కనిపెట్టాల్సిన పోలీసులు మనకెందుకులే అనుకున్నారు. అరకొర కేసులు నమోదు చేశారు. పందెం ప్రాణాలు పోయాయి.. పందెం దారులు మాత్రం రక్తపు సొమ్ము మూటగటుకున్నారు. http://farm4.staticflickr.com/3399/3212543736_fe7d5b2720_m.jpg 
 పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రతి మం డల కేంద్రంలో కోడిపందేలు జోరుగా సాగాయి. పండుగ మూడు రోజుల్లో 30 వేల పుంజులు రక్తం చిందించి నేల కూలాయి. ఈ పం దేలకు జిల్లా వ్యాప్తంగా ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడాది ఐ భీమ వరంలో పందాల జోరు తగ్గింది. బడా బాబులు మాత్రం జిల్లాలోని గణపవరం, పోడూరు, నిడద వోలు ప్రాంతాల వైపు ఈ సారి మొగ్గు చూపారు. ఆదివారం నిడదవోలు బరిలో సినీహీరో రవితేజ సం దడి చేశారు. అదేవిధంగా పోడూరులో మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి, తాడేపల్లిగూడెంలో మాజీ ఎమ్మెల్యే ఆధ్యర్యంలో సాగగా, ఐ భీమ వరంలో అబ్బాయిరాజు, గణపవరంలో మాజీ సర్పంచి కలిదిండి సోమ రాజు ఆధ్వర్యంలో పందాలు నిర్వహించారు.

జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పందాలు నిర్వహించి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు. పెదవేగి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జిల్లాలోని ప్రధానంగా ఎమ్మెల్యేలుగా పందాలు ఆడారు. అదే విధంగా గణపవరంలో నిర్వహించిన పందాల బరిలో మాజీ ఎమ్మెల్యే చెరుకవాడ రంగనాథరాజు, మాజీ మంత్రి, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు మాగంటి బాబు పాల్గొని సందడి చేశారు. గత సంవత్సరం ఐ భీమవరంలో 40 లక్ష లకు పందెం సాగగా ఈ సంవత్సరం పోడూరులో 14 లక్షలకు పైబడిన పందేన్ని నిర్వహించారు. ఇదే ఈ ఏడాది భారీ స్థాయి పందెం అని పందెం రాయుళ్లు చర్చించుకుంటున్నారు.http://www.hindu.com/mp/2004/06/14/images/2004061400010101.jpg
జేబులు ఖాళీ
జిల్లా వ్యాప్తంగా ఈ మూడు రోజుల పాటు నిర్వహించిన జూద క్రీడలయిన పందాలు, పేకాట, గుండాట వంటి వాటిలో కొందరు జేబులు గుల్ల చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ పం దేలలో రూ.80 కోట్లు చేతులు మారాయి అంటే ఈ జూదం ఏమేర సాగిందో అర్ధం చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు అరకొర కేసులను నమోదు చేశారు. ఈ మూడు రోజుల పాటు వివిధ జూదాలపై దాడులు చేసి జిల్లా వ్యాప్తంగా 681 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు లక్షల 36 వేల 894 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్‌పి రవివర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా ఎవరైనా పందాలు, పేకాట వంటి జూదక్రీడలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
http://www.hindu.com/mp/2004/06/14/images/2004061400010102.jpg
పంతం నెగ్గింది..పందెం ముగిసింది
తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు రూ.100కోట్ల మేర జూదం జరిగినట్టు అంచనా. మద్యం కూడా ఏరులై పారింది. పండుగ మూడు రోజులపాటు సగటున రూ.10 కోట్ల విలువ చేసే మద్యం విక్రయాలు జరిగినట్టుగా తెలుస్తోంది. అలాగే నాటుసారా విక్రయాలు కూడా కోట్ల రూపాయల మొత్తంలోనే జరిగి నట్టు సమాచారం. కోడిపందాలను అరికట్టాల్సిన పోలీసులకు కూడా భారీ మొత్తంలోనే మామూళ్ళు అందినట్టు తెలుస్తోంది. ఈ మూడు రోజులపాటు జరిగిన జూదంలో మద్య, పేదవర్గానికి చెందిన పం దెం రాయుళ్ళు భారీగా నష్టపోయారు.

punjus 

జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగినా, పోలీసులు మాత్రం దాడులు జరిపి పందాలను నిలువరించిన సంఘటనలు లేకపోవటం గమనార్హం. ఏజెన్సీ నుంచి, మైదాన ప్రాంతంలోని అన్ని మండలాల్లోను మూడు రోజులు యథేచ్చగా కోడి పందాలు, పేకాట, గుండాటలు జరిగాయి. కోనసీమలో పలువురు ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ పందాలను జరిపించారు. ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం, ఏజెన్సీకి ముఖద్వారమైన గోకవరం, ఏలేశ్వరం, అడ్డతీగల తదితర చోట్ల కోడిపందాలు జోరుగా సాగాయి. మారేడుమిల్లి, వై.రామవరం, గంగవరం, రాజవొమ్మంగి మండలాల్లోని పలుప్రాంతాల్లో కోడిపందాలు యథేచ్చగా జరిగాయి. రాజ మండ్రి నగ రాన్ని ఆనుకుని వున్న కోలమూరు, కోరుకొండలో గ్రామకమిటీల ఆధ్వర్యంలో కోడి పందాలు, పేకాట, గుండాటలు భారీగా జరిగాయి. http://www.andhrabulletin.com/admin/images/kodi%20pandalu%20in%20west%20Godavari%20(8).jpg
సముద్రతీరప్రాంతమైన కొత్తపల్లి, తాళ్ళరేవు, కాజు లూరు, తొండంగి, అంతర్వేది, అల్లవరం తదితర ప్రాంతాల్లో ఈ పందాలు బహిరంగంగానే జరిగాయి. ప్రజాప్రతినిధుల వత్తిళ్ళ మేరకు పోలీసులు సంక్రాంతి మూడు రోజులపాటు పందాల జోలికి వెళ్ళకపోవడంతో ఎక్కడిక్కడ కోడిపందాలు బరులు ఏర్పాటు చేసుకుని బహిరంగంగానే జూదాలు నిర్వహించారు. ఈ జూదాల్లో ఒక్కొక్క తోటలో కనీసం వెయ్యిమందికి తక్కువ కాకుండా జూదగాళ్ళు, ప్రేక్షకులు పాల్గోన్నారు. జిల్లాకు చెందిన చాలామంది జూదగాళ్ళు పొరుగు జిల్లా పశ్చిమగోదావరి జిల్లాకు భారీ సం ఖ్యలో తరలివెళ్ళారు. http://www.andhrabulletin.com/admin/images/kodi%20pandalu%20in%20west%20Godavari%20(5).jpg
ఈ జూదాల్లో ఈ మూడు రోజులపాటు దాదాపు రూ.100 కోట్లు చేతులు మారి నట్లు సమాచారం. సంక్రాంతి పండుగ రోజుల్లో దాదాపు రూ.30 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగి నట్టు తెలుస్తోంది. ఈ కోడిపందాల విషయంలో చూచిచూడనట్టు వ్యవహరించాలంటూ పోలీస్‌శాఖ ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం.ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న కొంతమంది పోలీసులు భారీగా మామూళ్ళు దండుకున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. పలు లాడ్జిలు, హోటళ్ళకు అనధికార అనుమతులు ఇచ్చి పేకాటరాయుళ్ళను ప్రోత్సహించారు. ఈ వ్యవ హారంలో పోలీసులకు భారీగా ముడుపులు ముట్టినట్టు సమాచారం.

No comments:

Post a Comment